'సాహో'కి ప్రత్యేక అనుమతి... రోజుకు ఆరు షోలు, టికెట్ రేట్ల పెంపునకు ఏపీ సర్కార్ ఓకే!

  • ప్రత్యేక అనుమతుల మంజూరు
  • రెండు వారాల పాటు పెరిగిన టికెట్ ధరల అమలు
  • హై బడ్జెట్ మూవీ అయినందునే అంటున్న అధికారులు
ప్రభాస్, శ్రద్ధ కపూర్ హీరో, హీరోయిన్లుగా సుజిత్ దర్శకత్వంలో రూపొందిన హై బడ్జెట్ చిత్రం 'సాహో' మరో మూడు రోజుల్లో విడుదలకు సిద్ధం కాగా, ఏపీ సర్కారు సినిమాకు ప్రత్యేక అనుమతులను మంజూరు చేసింది. సినిమా విడుదల అయ్యే అన్ని థియేటర్లలో ఆరు షోలను వేసుకునేందుకు, టికెట్ రేట్లను పెంచుకునేందుకు అంగీకరించింది. ఈ మేరకు ప్రత్యేక జీవో విడుదల అయింది.

వాస్తవానికి బీ, సీ సెంటర్ థియేటర్లలో రోజుకు నాలుగు షోలు వేస్తారు. ఇటీవలి కాలంలో కొన్ని చిత్రాలకు ఐదు షోలకు అనుమతి లభించింది. ఇప్పుడు ఏకంగా ఆరు షోలను ప్రదర్శించేందుకు ప్రభుత్వం అంగీకరించడం గమనార్హం. పెరిగిన టికెట్ రేట్లు ప్రధాన సెంటర్లలో రెండు వారాల పాటు, మిగతా సెంటర్లలో వారం పాటు అమలులో ఉండనున్నాయి. సినిమా భారీ బడ్జెట్ తో నిర్మించినది కావడంతోనే ఇలా ప్రత్యేక అనుమతులు ఇచ్చినట్టు ప్రభుత్వ అధికారులు అంటున్నారు.
Go Back to Shorts
Sahoo
Andhra Pradesh
Special Shows
Permission

More Telugu News